
నేటి నుంచే సదరమ్ క్యాంపులు
కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మంగళవారం నుంచి సదరమ్ (వికలత్వ నిర్ధారణ క్యాంపులు) నిర్వహించనున్నట్టు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ క్యాంపులు కొనసాగుతాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని క్లస్టర్ ఆస్పత్రుల్లో క్యాంపులు కొనసాగుతాయని, తేదీలవారీగా ఆయా నియోజకవర్గాలకు చెందిన వికలాంగులు హాజరుకావాలని కోరారు.