అవగాహనే ఆయుధం | Today is World Consumer Rights Day | Sakshi
Sakshi News home page

అవగాహనే ఆయుధం

Published Tue, Mar 15 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

Today is World Consumer Rights Day

వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలుంటే నిలదీయొచ్చు
చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన బాధ్యత వినియోగదారులదే
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

 
వరంగల్ బిజినెస్ :  వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడేందుకు మూల కారకుడు వినియోగదారుడే. అతడి అభిరుచే వ్యాపార సంస్థలకు ప్రామాణికం. వినియోగదారుడు మార్కెట్లో రకరకాల వస్తువులను కొని వినియోగిస్తుంటాడు. ఈక్రమంలో ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే ఆ వస్తువును లేదా సేవను అందించిన సంస్థను ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉంటుంది.  అయినప్పటికీ వినకుంటే చట్టపరం గా వారిపై పోరాడేందుకు అవకాశం ఉంది. నేడు(మంగళవారం) 33వ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిది.

ఐక్యరాజ్య సమితి ఆమోదంతో..
వినియోగదారుల హక్కుల ముసారుుదాను 1962 సంవత్సరంలో రూపొందిం చారు. దానికి ఐక్యరాజ్య సమితి 1983 సంవత్సరం మార్చి 15న ఆమోదం తెలి పింది. నాటి నుంచి ఆ రోజును ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
 
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
1986 సంవత్సరంలో వినియోగదారుల హక్కుల చట్టానికి భారత పార్లమెంట్ ఆ మోదం తెలిపింది. అనంతరం వ్యాపారుల చేతిలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు జిల్లాలవారీగా విని యోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పడ్డారుు. వరంగల్ జిల్లాలో విని యోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా 7 సంస్థలు పనిచేస్తున్నారుు. వాటిలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటి. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంతో పాటు నెక్కొం డ, జనగాం, మహబూబాబాద్ వినియోగదారుల మండళ్లు విశేష సేవలందిస్తున్నారుు.
 
వినియోగదారుల ఫోరాన్ని  ఆశ్రరుుంచడమిలా..
మీరు ఏదైనా ఒక వస్తువును కొని ఉండొచ్చు.. లేదా ఒక సంస్థ నుంచి సేవను పొంది ఉండొచ్చు. దానిలో నాణ్యతా లోపాన్ని గానీ.. తూకాల్లో తేడా గానీ.. సేవల్లో వైఫల్యాన్ని గానీ.. నకిలీదని గుర్తిస్తే దానిపై విక్రరుుంచిన వ్యాపారిని నిలదీయొచ్చు. వారు స్పందించకుంటే జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించాలి. వినియోగదారులు రూ. 20 లక్షలలోపు పరిహారం పొందాలనుకుంటే జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటి దాకా పరిహారం కోసం రాష్ట్ర ఫోరంలో, రూ.కోటికిపైన నష్టపరిహారం కోసం జాతీయ కమిషన్‌లో ఫిర్యాదును నమోదు చేయొచ్చు.
 
చట్టాలు ఉన్నా ఫలితం లేదు
 పుట్టిన వ్యక్తి దగ్గరి నుంచి చనిపోయే వ్యక్తి వరకు ప్రతిఒక్కరూ వినియోగదారుడే. అందుకే ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. అవి ఉన్నా ఫలితం ఏమీ కన్పించడం లేదు. ఈ మేరకు వినియోగదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
 - సాంబరాజు చక్రపాణి, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు
 
విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలి
ఇతర దేశాల్లో నిషేధించిన వస్తువులను మన దేశానికి దిగుమతి చేసి అమ్ముకోవడానికి బహుళజాతి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వీటి వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది. వినియోగదారుడు చైతన్యవంతుడు అయినప్పుడే మోసపోడు.
- డాక్టర్ పల్లెపాడు దామోదర్, ఉపాధ్యక్షుడు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement