మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఆసరా’ పథకం కింద చేపట్టిన పింఛన్ల పంపిణీని శనివారం జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభిస్తున్నారని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో సీఎం పర్యటనపై అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ కొత్తూర్ మండలంలోని నాట్కో ఫార్మా స్కూటికల్ దగ్గర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం దగ్గర బారికేడ్లతోపాటు, రోడ్ల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సమస్య లేకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లను చూసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈకి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిందిగా అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డికి సూచించారు. సమావేశంలో జేసి ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ రవీందర్, జెడ్పీ సీఈఓ నాగమ్మతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్తూరుకు నేడు కేసీఆర్ రాక
Published Sat, Nov 8 2014 7:21 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Advertisement