నారాయణఖేడ్, జహీరాబాద్/జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్‌లోని రహమాన్ ఫంక్షన్ హాల్ సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణకు లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు సభ జరగనుం ది. సభా ప్రాంగణాన్ని పార్టీ నాయకులతోపాటు ఖేడ్ సీఐ నందీశ్వర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.
జహీరాబాద్‌లోని ఆర్టీసీ బస్డాండ్ వెనుక భాగంలో గల మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ జరగనుంది. ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు ఎం.శివకుమార్, పి.నర్సింహా రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. ఉత్తమ్ గార్డెన్ వద్ద హెలీపాడ్‌ను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశ్, జహీరాబాద్ సీఐ నరేందర్, ఎస్‌ఐ శివలింగం పరిశీలించారు. జోగిపేటలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, అందోల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పి.కిష్టయ్య, నాయకులు పి.శివశేఖర్, డీబీ నాగభూషణం, నర్సింగ్‌రావు తదితరులు శుక్రవారం సభా ప్రాంగణాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌కు జోగిపేటకు రానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. టీచర్స్ కాలనీ వెనుక భాగంలోని రాచప్ప వ్యవసాయ భూమిలో హెలీపాడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన
Published Fri, Apr 25 2014 11:59 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement