నిజామాబాద్ అర్బన్ : నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి. ముఖ్యమంత్రిగా ఆయన జిల్లా అభివృద్ధికి ఎం తో కృషి చేశారు. వైఎస్ పాలనలో జరిగిన పలు అభివృద్ధి పను లు ప్రజలకు నేడు వరంగా మారాయి. రాజశేఖరరెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ సమస్యలు విన్న వెంటనే గట్టి హామీలు ఇచ్చారు. వాటిని ఆచరణలో పెట్టి మాట నిలుపుకున్నారు. అం దుకే జిల్లాలో రాజశేఖరరెడ్డి అంటేనే నేటికీ అభిమానం.
విద్యా, వైద్యం అందుబాటులోకి
జిల్లాకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతై వెద్య విద్యావకాశాలను కల్పిం చా రు. 2008లో తెలంగాణ యూనివర్సిటీని మంజూరు జేశారు. 2009లో జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. తెలంగాణలో అన్ని జిల్లాలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి. నిజామాబాద్‌లో వైద్య విద్య ఏర్పాటు కావాలని జిల్లావాసులు కోరగా ఆయన వెం టనే హామి ఇచ్చి నెరవేర్చారు.
పంటలకు ప్రాణం
2004కు ముందు జిల్లాలో వ్యవసాయ రంగం దీనావస్థలో ఉండేది. పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం వైఎస్ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాముఖ్యతను కల్పిం చారు. బీడు భూములకు నీళ్లు కల్పించి పచ్చని పంటలు పండించేలా తోడ్పాటును అందించారు. అందులో భాగంగానే గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు నేడు లక్షల ఎకరాల పంటలకు సాగునీరును అందిస్తున్నాయి.
నిజాంసాగర్ ఆధునీకరణకు నడుంబిగించి, రూ. 500 కోట్లరూపాయలను మంజూరు చేశారు. దీంతో పంటకాలువకు మహార్దశ కలిగింది. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో రైతులకు అండగా నిలిచారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను అందించి వారికి ఆసరాగా నిలిచారు. రూపాయి కిలో బియ్యం పేదలకు ఎంతగానో ఉపయోగపడింది. ఆరోగ్యశ్రీ పేదరోగుల పాలిట వరంగా మారింది.
ఇందూరులో రాజన్న యాది
Published Tue, Jul 8 2014 2:11 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement