మాట్లాడుతున్న రవికుమార్
చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్ అర్బన్): దివంగత సీఎం వైఎస్సార్ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తునట్లు ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగదేషి రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలోని విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతిని జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం, పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం, కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ అపర భగీరథుడని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు తెలంగాణ వెలుగుతోందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని, ఇప్పటికీ పేదల గుండెల్లో వైఎస్ కొలువై ఉన్నారని తెలిపారు.
‘108’ పేరుతో అత్యవసర సేవలకు అంబులెన్సులు, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు భారం కాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న పేద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, ఎలాంటి చికిత్సకైనా ఆరోగ్య శ్రీ పథకం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టారని చెప్పారు. వైఎస్సార్ జయంతి వేడుకల్లో వైఎస్ అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్య పాల్గొనాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment