గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్: కారులో ప్రయాణిస్తేనే టోల్‌టాక్స్ కడతారనుకుంటే పొరబాటే.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ‘టోల్’ తీస్తున్నారు. ఒక్క టోల్ గేట్ దాటితే సాధారణ టిక్కెట్‌పై అదనంగా రూ.4 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడు మూడు గేట్లు దాటాల్సి ఉం టుంది. ఈ లెక్కన ఒక్కో ప్రయాణికుడు టిక్కెట్‌పై అదనంగా రూ.12 చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ పోయి, రావాలంటే అదనంగా రూ.24 భారం పడుతోంది.
సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి టోల్‌టాక్స్ రూపంలో 30 శాతం అదరనపు భారం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో దూరాన్ని బట్టి టాక్స్‌ను టిక్కెట్‌లో జమ చేసి ఇష్యూ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వచ్చే ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్, ఇతర అన్ని బస్సులకు తేడా లేకుండా ఒకేలా ప్రతి ప్రయాణికుడిపై రూ.4 భారాన్ని వేస్తున్నారు. కరీంనగర్ నుంచి 45కిలోమీటర్ల దూరంలో బసంత్‌నగర్ వద్ద టోల్‌టాక్స్ పాయింట్ ఉంది. ఈ ప్రాంతంలో ధర్మారం, బసంత్‌నగర్ రెండు స్టాపులు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అర కిలోమీటర్ దాటిన ప్రయాణికులకు రూ.4 రూపాయల టోల్ టాక్స్‌ను ఆర్టీసీ వసూలు చే స్తోంది. అలాగే గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల నుంచి వచ్చే దూర ప్రయాణికులకు, ఎన్టీపీసీ, బసంత్‌నగర్ నుంచి 2 కిలో మీటర్లు ప్రయాణించే వారికి రూ.4 భారం పడుతుంది.
స్థానికులను గుర్తించాలి
వాస్తవానికి ఒక టోల్ టాక్స్ పరిధిలో కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించే వారిని టాక్స్ లేకుండా వాహనాలను, ఇతరులను పాస్ చేయాలి. అయితే కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై తక్కువ దూరం ప్రయాణించిన వారి నుంచి టాక్స్ వసూలు చేస్తున్నారు. బసంత్‌నగర్ నుంచి ఎప్టీపీసీ, గోదావరిఖని, పెద్దపల్లి, ఇతర చుట్టపక్కల ప్రాంతాలు కేవలం 10 నుంచి 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నాయి. స్థానికులను గుర్తించి ప్రత్యేక పాస్‌లు అందించాలని వారు కోరుతున్నారు. టిక్కెట్‌పై అదనంగా వసూలు చేస్తున్న రూ.4పై ఆర్టీసీ అధికారులను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని పేర్కొనడం విశేషం.
బస్సెక్కినా ‘టోల్’ తీసుడే..
Published Thu, Jun 5 2014 3:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement