తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.
హాజరు కానున్న దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, రాష్ర్ట ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి. కుంతియా పాల్గొననున్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మైనారిటీల పట్ల అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా, డిసెంబర్ 31వ తేదీ వరకు జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదివారం సమీక్షించనున్నారు.