సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ప్రకటించారు. గిరిజన సంక్షేమశాఖ పనితీరును అధికారులతో తన ఛాంబరులో గురువారం సమీక్షించారు. గిరిజన పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని, గిరిజన విద్యావంతులు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. బాలికల వసతి గృహాల లోపాలు సవరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అన్ని హాస్టళ్లకు ప్రహరిగోడలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.