
రాజ్యహింసకు గురవుతున్న గిరిజనులు: వరవరరావు
దేశంలో, రాష్ట్రంలో గిరిజనులు భయంకరమైన రాజ్యహింసకు గురవుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు
హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో గిరిజనులు భయంకరమైన రాజ్యహింసకు గురవుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉన్న హక్కులు కూడా పోయా యని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఆదివాసీలపై ‘అక్రమ కేసులు–హక్కుల ఉల్లంఘన’ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో వరవరరావు మాట్లాడుతూ... ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్నారు.
రాష్ట్రంలో హరితహారం పేరుతో మొక్కలను నాటు తూ, పోడు భూములను ఆక్రమించుకుంటున్నార న్నారు. 1945లోనే కొమురంభీం ‘మా ఊళ్లో మా రాజ్యం’ అనే నినాదం ఇచ్చారని, అందుకే ఆది వాసీలకు స్వయంప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల పోడు భూములకు పట్టాలి వ్వాలని, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆదివాసీలకు ఉన్న ప్రత్యేకమైన హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని సామాజికవేత్త సాంబశివరావు అన్నారు. తుడుం దెబ్బ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్, రమణాలలక్ష్మయ్య, ప్రొఫెసర్ కాశీం పాల్గొన్నారు.