టీఆర్‌ఎస్ కార్యకర్తల కుమ్ములాట | TRS activists Factionalism in Nalgonda | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ కార్యకర్తల కుమ్ములాట

Published Thu, Aug 7 2014 1:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

టీఆర్‌ఎస్ కార్యకర్తల కుమ్ములాట - Sakshi

టీఆర్‌ఎస్ కార్యకర్తల కుమ్ములాట

 నల్లగొండ తెలంగాణా రాష్ట్ర సమితిలో వర్గపోరు బహిర్గతమైంది. బు దవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ములాడుకున్నారు. జయంతి ఉత్సవాలకు ముఖ్య అతి థిగా పాల్గొనడానికి నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం రాక కోసం ఎదురు చూస్తుండగా కార్యకర్తల మ ధ్య వాగ్వాదం, తోపులాట జరి గింది. పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేం దర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి మరింకొంత మంది ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశా రు.
 
 కాగా ఆ పార్టీ నాయకులు దు బ్బాక నర్సింహారెడ్డి ఫొటో ఫ్లెక్సీలో పెట్టలేదని ఆయన అనుచరులు జహంగిర్‌తో పాటు మరి కొందరు ఫ్లెక్సీని చింపి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కాగా బండా నరేందర్‌రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఫరీదుద్దీన్, జమాల్‌ఖాద్రి, దుబ్బాక నర్సింహారెడ్డి వర్గాయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకోవడంతో తోపులాట జరి గిం ది. కాగా ఇరువర్గాల వారిని దుబ్బా క నర్సింహారెడ్డి, బండా నరేందర్‌రెడ్డిలు సర్థిచెప్పారు.
 
 ఘనంగా జయశంకర్ జయంతి
 టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నా రు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మైనం శ్రీనివాస్, వెంకటాచారి, మాలె శరణ్యరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సిం గం రామ్మోహన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement