ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీకి అండగా నిలవాలి | MLC election Support BJP | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీకి అండగా నిలవాలి

Published Sun, Dec 21 2014 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

MLC election Support BJP

నల్లగొండ టుటౌన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకపాత్ర పోషించిందని,  అందుకు బహుమతిగా నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో  బీజేపీకి అండగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు , జిల్లా ఇన్‌చార్జ్  పేరాల చంద్రశేఖర్‌రావు కోరారు. శనివారం వసుంధర ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన  మాట్లాడారు.  త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. పట్టణ అధ్యక్షుడు బొజ్జ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసార్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి,  పోరెడ్డి రాములు, నూకల వెంకటనారాయణరెడ్డి, బాకి పాపయ్య, బండారు ప్రసాద్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కూతురు లక్ష్మారెడ్డి, యాదగిరిచారి, కంకణాల నాగిరెడ్డి, గుండగోని శ్రీను, రావెళ్ల కాశమ్మ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement