నల్లగొండ అగ్రికల్చర్ :రుణమాఫీపై రైతాంగంలో అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ఉన్నప్పటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా సాగదీత ధోరణితో ముందుకు వెళ్తుంది. రోజుకో నిబంధన విధిస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తుంది. లక్ష రూపాయలలోపు పంట రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గతంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్యాంకులో పంట రుణంతో పాటు బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పొందిన పంట రుణాలలో ఏది ఎక్కువ ఉంటే (లక్ష రూపాయల వరకు) దానిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
ఒక వేళ పంట రుణమే లక్ష వరకు ఉంటే దానినినే మాఫీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచిం చిన మార్గదర్శకాల మేరకు పది రోజులుగా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు కసరత్తు చేసి రూ.లక్ష లోపు రుణా లు పొందిన వారి జాబితా సిద్ధం చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5,46,419 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి సుమారు రూ.2,782 కోట్ల వరకు మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంఛనా వేశారు. సిద్ధం చేసిన జాబితాలను గ్రామ సభలో ప్రకటించారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అభ్యంతరాలు స్వీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మొదటికొచ్చిన ‘రుణమాఫీ’
Published Wed, Sep 3 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement