రుణమాఫీపై హామీని నిలబెట్టుకోవాలి:ఎర్రబెల్లి | trs government should be stand on loan waiver promiese, demand errabelli dayakar rao | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై హామీని నిలబెట్టుకోవాలి:ఎర్రబెల్లి

Published Mon, Nov 10 2014 10:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

రుణమాఫీపై హామీని నిలబెట్టుకోవాలి:ఎర్రబెల్లి

రుణమాఫీపై హామీని నిలబెట్టుకోవాలి:ఎర్రబెల్లి

హైదరాబాద్:రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఎర్రబెల్లి.. ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. రుణమాఫీపై టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు.

 

మేనిఫెస్టోలో రూ. లక్ష వరకూ రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు పంట రుణాలకు మాత్రమే అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు మాఫీ వర్తింపజేయడం లేదని ఎర్రబెల్లి మండిపడ్డారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలన్నీ మాఫీ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement