'అక్షర చైతన్య దీప్తి రగిల్చిన కాళోజీ'
హైదరాబాద్: తెలంగాణ పోరాటానికి తన అక్షరాలతో చైతన్య దీప్తిని రగిల్చిన యోధుడు కాళోజీ నారాయణ రావు అని పలువురు టీఆర్‌ఎస్ నేతలు కొనియడారు. కాళోజీ101 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని రహమత్‌నగర్ డివిజన్ ఎన్.ఎస్.బీ నగర్ లో బుధవారం ఆయన చిత్ర పటానికి టీఆర్‌ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ తెలంగాణ వెనుక బాటుతనాన్ని, అనాటి పాలకుల దమన నీతిని సరళమైన తెలంగాణ యాస భాషలో ఎండగట్టిన ఘనత కాళోజీకి మాత్రమే దక్కుతుందన్నారు. కాళోజి సేవలను గుర్తించిన తెలంగాణ ముఖ్య మంత్రి కేసిఆర్ ఆయన పేరుతో మెడికల్ ఇనిస్టిట్యూట్ను తన స్వస్ధలమైన వరంగల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు.
ఆయన రాసిన 'నాగొడవ' కవిత సంపుటిలో తెలంగాణ అణచి వేత ప్రతిభింబిస్తుందన్నారు. అనంతరం విద్యార్ధులకు మిఠాయిలను పంచి పెట్టారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ సంఘం బోర్డు సభ్యుడు గంధం అంజన్న, డివిజన్ అధ్యక్షుడు నరసింహా, నాయకులు పద్మ యాదవ్, మేఘన పద్మ,మహేష్ యాదవ్, ప్రసాద్, యాదిగిరి,చంద్రమౌళి,ఎన్.ఎస్.బీ నగర్ ప్రభుత్వ పాఠాశాల ఉపాధ్యాయుడు శ్యాంసుందర్, జహంగీర్, లడ్డు, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.