కోదాడటౌన్ : తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాది తెచ్చింది టీఆర్‌ఎస్ మాత్రమేనని, రాష్ట్రాని పాలించేది కూడా టీఆర్‌ఎస్ మాత్రమేనని, ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ మాత్రమే విజయం సాధించే విధంగా తెలంగాణ వాదులు తీర్పునివ్వాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి కోదాడలోని డేగబాబు ఫంక్షన్ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వాటికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కంరెంట్ విషయంలో చంద్రబాబు కరీంనగర్‌కు వచ్చి పచ్చిఅబద్దాలు చెప్పినా టీడీపీ నాయకులు నోరు మొదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అసెంబ్లీ తొలి రోజు కాంగ్రెస్, టీడీపీలు చేసిన పని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారిని ఈసడించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వరరెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందని, వస్తున్న రిపోర్టుల ప్రకారం 70 శాతం ఓట్లు రాజేశ్వరరెడ్డికి వస్తాయన్నారు. దానిని 80 శాతానికి పెంచాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియమాకాల కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో పట్టభద్రులు చూపిన తెగువ మరువలేనిదని, కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా విద్యావంతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అంతకుముందు టీఆర్‌ఎస్ నాయకులు కోదాడ పట్టణంలో రంగా థియేటర్ నుంచి డేగబాబు ఫంక్షన్‌హాల్ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జీ కె.శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గింజల రమణారెడ్డి ఆహూతులను ఆహ్వానించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, దామోదరరెడ్డి, రావెళ్ల సీతరామయ్య, నాగేంద్రబాబు, డేగరాణి , వసంతమ్మ, ఝాన్సీ,డేగబాబు, గరిణె కోటేశ్వరరావు, కందాళ పాపిరెడ్డి, రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, పుల్లయ్య, చిలక రమేష్, గట్ల నర్శింహారావు, తుపాకుల భాస్కర్, కుక్కడపు బాబు, వెంకటనారాయణ, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి
Published Sun, Mar 8 2015 12:06 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement