ప్రాజెక్టులు ఆపడమే వారి లక్ష్యం: టీఆర్‌ఎస్‌ | trs mla's fired on congress party leaders | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు ఆపడమే వారి లక్ష్యం: టీఆర్‌ఎస్‌

Published Sat, Mar 18 2017 3:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రాజెక్టులు ఆపడమే వారి లక్ష్యం: టీఆర్‌ఎస్‌ - Sakshi

ప్రాజెక్టులు ఆపడమే వారి లక్ష్యం: టీఆర్‌ఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: సాగు నీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే వాటిని ఆపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పని చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల వీరేశం ఆరోపించారు. శుక్ర వారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ... ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులుండవనే కాంగ్రెస్‌ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని గువ్వల బాలరాజు అన్నారు.  కాంగ్రెస్‌ నేతల్లో సీఎం కావాలనే కోరికతో ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సర్కారు రైతుల పక్షాన ఉంటుందని బాలరాజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement