తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని త్వరలో బయటపెడతామని ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, గువ్వల బాలరాజు అన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేణుగోపాల చారి, గువ్వల బాలరాజు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని త్వరలో బయటపెడతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా వారు మండిపడ్డారు. కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సర్కార్కు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయిని చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన కిషన్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.