
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు గృహ నిర్మాణ సంస్థ(టీఎస్‌పీహెచ్‌సీ) చైర్మన్‌గా కోలేటి దామోదర్ గుప్తా పదవీకాలం మరో ఏడాది పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని ఏడాది కాలం పొడగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తారని కోలేటి దామోదర్‌గుప్తా అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనిచేసేవారంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని, తన పనితనాన్ని చూసి ఆయన తన పదవీకాలాన్ని పొడగించారన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేసి పాలనను పారదర్శకం చేస్తానని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment