టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల ధర్నా | TSPSC employees strike for records | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల ధర్నా

Published Fri, Feb 13 2015 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

TSPSC employees strike for records

- తెలంగాణ రికార్డులు ఇవ్వాలని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిరసన


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగులు గురువారం ధర్నాకు దిగారు. తెలంగాణ జిల్లాలకు చెందిన పాత రికార్డులు, ఫైళ్లు ఇతర సమాచారాన్ని తమకివ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఏపీపీఎస్సీ పరిపాలన గదికి కొద్దిసేపు తాళం వేసి కార్యకలాపాలను అడ్డుకున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ ఏర్పడినా రికార్డులు ఇవ్వకుండా తమ కార్యకలాపాలు కొనసాగకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీకి బదిలీ అయిన ఉద్యోగుల దగ్గరి ఏపీ రికార్డులను ఏపీపీఎస్సీ అధికారులు తీసుకుని, తెలంగాణ రికార్డులను ఇవ్వడం లేదన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే ఇరు కమిషన్ల కార్యదర్శులు దీనిపై చర్చించారు. రెండు మూడు రోజుల్లో రికార్డులను ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ అంగీకరించిందని చెప్పడంతో ఆందోళన విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement