టీవీ9 ప్రసారాల నిలుపుదల సమంజసమే
నటుడు, దర్శకుడు నారాయణమూర్తి
హైదరాబాద్: టీవీ9 చానల్ ప్రసారాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. టీవీ9 ప్రసారాలను నిలుపుదల చేయడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రాజ్యాధికారం’ చిత్రంపై మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. మీడియాలో ప్రసారమయ్యే కార్యక్రమాలు చైతన్యవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉండాలి కానీ సంస్కృతిని, సంప్రదాయాలను, యాస, భాషను కించపరిచేలా ఉండకూడదని నారాయణమూర్తి స్పష్టం చేశారు.