రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం కొత్త చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. శాంతినగర్‌కు చెందిన సాయిరాహుల్ (14) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. సయ్యద్ తాజ్ (13) ఏడవ తరగతి చదువుతున్నాడు.
వీరిద్దరూ గురువారం ఉదయం ఈతకు వెళ్లారు. సాయంత్రం అయిన తిరిగి రాకపోవడంతో చెరువులో వెతకగా వీరిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.