
వడదెబ్బతో రెండేళ్ల చిన్నారి మృతి
కోరుట్ల : కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలో గురువారం వడదెబ్బకు రెండేళ్ల చిన్నారి ఉమీరా మృతిచెందింది. ఇంటి దగ్గర వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.