సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆధారిత సేవలను అందజేసే ఉబర్ క్యాబ్స్‌పై రవాణాశాఖ నిషేధం విధించింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ నిషేధం కొనసాగుతుందని రవాణా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు ఉబర్ సంస్థతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి వీల్లేదన్నారు.
ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లో ఉబర్ క్యాబ్‌లను నిషేధించారు. ప్రయాణికులు సైతం ఆ సంస్థకు చెందిన వాహనాలను బుక్ చేసుకోవద్దని, వాటిలో వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. అక్రమంగా తిరిగే క్యాబ్‌లపై తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఉబర్ క్యాబ్స్ పై నిషేధం
Published Wed, Dec 10 2014 6:33 AM | Last Updated on Thu, Aug 30 2018 9:11 PM
Advertisement
Advertisement