డంకన్‌ డ్రైవర్లపై రవాణా శాఖ కొరడా | transport department attack on drunken drivers | Sakshi
Sakshi News home page

డంకన్‌ డ్రైవర్లపై రవాణా శాఖ కొరడా

Published Sun, Oct 22 2017 3:45 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

transport department attack on drunken drivers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు.. రవాణా శాఖ అధికారులు తోడయ్యారు. ఇప్పటి వరకూ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్న ఈ పరీక్షలను రవాణా శాఖ కూడా చేపడుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాన్ని నడిపే వారి డ్రైవింగ్‌ లైసెన్సు రద్దుతో పాటు ఆ వాహనాన్ని రవాణా శాఖ సీజ్‌ చేస్తోంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది. ఏ కేటగిరి వాహనమైనా సీజ్‌ చేసి సమీప పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించేలా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాగి వాహనం నడిపేవారిపై రవాణా శాఖ కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది.

రవాణా శాఖ ఇటీవలే రూ.3 కోట్లతో బ్రీత్‌ ఎనలైజర్లను కొనుగోలు చేసింది. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే ప్రస్తుతం వాహనదారుడి లైసెన్సు సస్పెండ్‌ చేయడంతో పాటు ప్రాసిక్యూషన్‌ చేస్తున్నారు. తాగి వాహనం నడిపిన వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్సును మూడు నెలలు సస్పెండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు రూ. 2 వేల జరిమానా, ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. వీటికి తోడు వాహనాన్ని కూడా సీజ్‌ చేసేందుకు ఉన్నత స్థాయి నుంచి రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్‌పోస్టుల్లో అధికారులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,200 కేసులు నమోదు చేశారు.

లారీ డ్రైవర్లే ఎక్కువ..
రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ అధికారులు చేపడుతున్న డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో అధికంగా లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారు. సాధారణంగా వంద మిల్లీ లీటర్ల రక్తంలో 30 మి.గ్రా. మోతాదు కంటే అధికంగా ఆల్కహాల్‌ ఉంటే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేస్తారు. తాగి నడుపుతున్న లారీ డ్రైవర్లలో 300 మి.గ్రా. నుంచి 400 మి.గ్రా. మోతాదు వరకు ఆల్కహాల్‌ ఉంటోంది. ఈ మోతాదులో ఆల్కహాల్‌ సేవించి లారీని నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి ప్రమాదాల్లో 40 శాతం మరణాలు ఇలాంటివే అని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట సరిహద్దు ప్రాంతాలైన దాచేపల్లి, మాచర్ల, గురజాలలో ఇటీవల కాలంలో అధికంగా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో వాహనదారులు పట్టుబడ్డారు. ఈ నెలలో ఇక్కడ మొత్తం 486 మంది లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి లారీలను సీజ్‌ చేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. ఇందులో 185 మందికి జైలు శిక్ష పడగా, 301 మందికి జరిమానా విధించామన్నారు. ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే వాహనాలకు రెండో డ్రైవర్‌ ఉంటే వదిలేస్తున్నామన్నారు. లారీల యజమానులు తమ డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని చెప్పారు. డ్రైవర్‌ తాగి వాహనం నడిపినపుడు ప్రమాదాలకు కారణమైతే సంబంధిత యజమానిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.   

కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఆనందరావు గొర్రెల కాపరి. వయస్సు 21ఏళ్లు. ఉన్నట్టుండి ఓ రోజు ముక్కు నుంచి రక్తం ధారగా కారడంతో ఒక్కసారిగా శరీరమంతా నిస్సత్తువ ఆవహించింది. ఆస్పత్రికి వెళ్తే.. అన్ని పరీక్షలు చేశాక చివరకు రసాయన పురుగు మందుల కారణంగా ఎక్కువగా వచ్చే ఎప్లాస్టిక్‌ ఎనీమియా వ్యాధిగా తేల్చారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆనందరావుకు గ్రామస్తులందరూ కలిసి రూ.2లక్షలు సాయం చేశారు. అయినా పెద్దగా మార్పు లేకపోవడంతో ఇప్పుడు ఆనందరావుది దిక్కుతోచని పరిస్థితి. 

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన గాయత్రిది మరో రకమైన సమస్య. ఆమెకు ఇటీవలే వివాహమైంది. పెళ్లయిన నాలుగు నెలలకు గర్భం దాల్చింది. ఎంతో ఆనందంగా ఉన్న ఆమెకు ఒక్కసారిగా షాక్‌. కడుపులో ఏదో తెలియని ఇబ్బంది. డాక్టర్‌ వద్దకు వెళ్తే బిడ్డ ఎదుగుదల లేదని చెప్పారు. అబార్షన్‌ చేసి పిండాన్ని తొలగించారు. పరీక్షలు చేస్తే.. ఎప్లాస్టిక్‌ ఎనీమియా అన్నారు. పురుగు మందుల అవశేషాల కారణంగా సోకినట్లు నిర్ధారించారు. మాతృత్వం మాధుర్యాన్ని చూడాలనుకున్న ఆమెలో ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement