
చిట్యాల/రామన్నపేట: నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల కథా రచయిత, కార్టూనిస్ట్, ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ (45) మంగళ వారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివా రులోని శ్రీ బాలనర్సింహస్వామి ఆలయం సమీపంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ కలహాల తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రచించిన పలు బాలల కథలు ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్‌డే బుక్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘చెట్టు కోసం’ అనే కథ మొదటగా సాక్షిలోనే ప్రచురితమైంది. ఆ కథను మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది.