బీబీనగర్:ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఊహించలేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమీలాపేట, నెమురగొముల, రాయరావుపేట గ్రామాల మీదుగా చేపట్టిన రహదారి విస్తరణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ నిద్ర లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అలవెన్సు పెట్టుకున్న టీడీపీ సైతం ఆంధ్రా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోలేకపోయిందని కాని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో అలవెన్సు లేకపోయినా కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారని తెలిపారు.
రానున్న 4ఏళ్లలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తయారు చేస్తామని దీంట్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల శాశ్వత సమస్యల పరిష్కారం కోసం వాటర్‌గ్రిడ్, ధర్మల్‌ప్లాంట్ లాంటి పెద్ద ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ జిల్లాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. క్షణం తీరిక లేకుండా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎవరికీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ గోళి ప్రణిత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏరుకల సుధాకర్‌గౌడ్, జెడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్‌లు మీరాబాయి, నర్సింహ, అనసూయ, అంజయ్య, ఎంపీటీసీ మన్నె బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఊహించలేని విధంగా అభివృద్ధి
Published Wed, Jun 10 2015 12:51 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement