వీణ, వాణీల చికిత్సపై ఎయిమ్స్ సలహా కోరాం
- అవసరమైతే లండన్ వైద్యులను రప్పిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వీణ, వాణీల శస్త్రచికిత్స విషయంలో లండన్ వైద్యులు పంపిన నివేదికపై ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ సలహా కోరుతూ లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఇంకెక్కడైనా శస్త్రచికిత్స చేసే సదుపాయాలున్నాయా.. లేవా వంటి అంశాలపై వివరాలు పంపాలని కోరామన్నారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు లండన్ వైద్యులనే ఇక్కడకు రప్పించే అవకాశాలను పరిశీలించాలని, దీనిపై సాధ్యాసాధ్యాలు తెలపాలని ఎయిమ్స్ వైద్యనిపుణులను కోరినట్లు మంత్రి తెలిపారు.
నేటి నుంచి ‘మిషన్ ఇంద్రధనుస్సు’: ఏడు వ్యాక్సిన్లు కలిపి వేయనున్న ‘మిషన్ ఇంద్రధనుస్సు’ టీకాల కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.