పొత్తులపై 2019లోనే నిర్ణయం.. | Venkaiah Naidu: BJP will take a call on TDP alliance in 2019 | Sakshi
Sakshi News home page

పొత్తులపై 2019లోనే నిర్ణయం..

Published Sat, May 27 2017 1:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

పొత్తులపై 2019లోనే నిర్ణయం.. - Sakshi

పొత్తులపై 2019లోనే నిర్ణయం..

కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్య
గన్నవరం: వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయం 2019లో తేల్చుకోవాల్సిన అంశమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. దానిపై ఇప్పటినుంచి అనవసరంగా చర్చించుకుని, వివాదాలు సృష్టించే పనిలో భాగస్వాములు కావద్దని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పొత్తులపై అంతర్గతంగా చర్చించుకున్నాకే అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు. రాయ్‌పూర్‌ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.  

కేసీఆర్‌ వ్యాఖ్యలు సరికాదు: తెలంగాణ పర్యటనలో అమిత్‌ షా ఎక్కడా కేసీఆర్, టీఆర్‌ఎస్‌ గురించి ఒక్కమాటా ప్రస్తావించలేదని వెంకయ్య అన్నారు. ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు ఇస్తుందని మాత్రమే చెప్పారని, ఇప్పటికే రూ.65 వేల కోట్ల  సాయం వచ్చిందని స్వయంగా కేసీఆర్‌ అంగీకరించారని చెప్పారు. అయినా అమిత్‌షాపై కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement