
సాక్షి, మేడారం(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా నిలవెత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసి కుంభమేళాగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మరో వైపు వనదేవతల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మేడారం భక్తులతో జనసంద్రమైంది.