పొన్నాలకు సొంత జిల్లా కాంగ్రెస్ నేతల షాక్ | warangal congress leaders shock to ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

పొన్నాలకు సొంత జిల్లా కాంగ్రెస్ నేతల షాక్

Published Thu, Aug 7 2014 12:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పొన్నాలకు సొంత జిల్లా కాంగ్రెస్ నేతల షాక్ - Sakshi

పొన్నాలకు సొంత జిల్లా కాంగ్రెస్ నేతల షాక్

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత జిల్లాకు చెందిన నేతలే షాక్ ఇచ్చారు. గాంధీభవన్లో గురువారం ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఓటమికి పొన్నాలే కారణమని ....ఆయనకు సమీక్షలు నిర్వహించే అర్హత లేదని జిల్లా నేతలు మండిపడుతున్నారు.

ఇదే విషయాన్ని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య... మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి...తాము ఈ సమావేశానికి హాజరు కావటం లేదని తెలిపారు. సొంత నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని పొన్నాలపై వారు ధ్వజమెత్తారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఇకనైనా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement