ముర్గీచౌక్‌లోని నిజాం కాలం నాటి హైదరాబాద్ జనతా జల్‌శాలా.
చార్మినార్: నగరంలో దాహం తీర్చడానికి పలు ప్రాంతాలలో చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆయా ప్రాంతాలలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వసుంటాయి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దాహంతో ఉన్న ప్రజలకు మంచినీరు అందజేయడానికి చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో స్వచ్చందంగా మంచినీటిని అందజేస్తుండడం ప్రశంసనీయం. మంచినీటి సౌకర్యం కల్పించే ప్రక్రియ దాదాపు నిజాం కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే, పాతబస్తీలో రౌండ్ ది క్లాక్ మంచినీరు అందజేస్తున్న చలివేంద్రాలు కూడా ఉన్నాయి. ఏడాది పొడవునా మంచినీరు అందుబాటులో ఉంటుంది. పాతబస్తీలోని ముర్గీచౌక్ వద్ద ఉన్న చలి వేంద్రం 100 ఏళ్లుగా దాహం తీరుస్తోంది.
1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద...
1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద నిజాం కాలంలో నీటి కేంద్రం నిర్మాణం జరిగింది. అప్పట్లో జల్‌శాల అనే వారు. జల్‌శాల అంటే నీటి కేంద్రం..అని. అప్పటి నుంచి ఈ జల్‌శాల ద్వారా ఇక్కడి ప్రజలకు మంచినీరు అందుతోంది. కాగా 1965లో అప్పటి హైదరాబాద్ మేయర్ దీనిని హైదరాబాద్ జనతా జల్‌శాలగా నామకరణం చేసి ఆధునీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మంచినీటి కేంద్రం నిరంతరం పని చేస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ నీరు అందుబాటులో ఉంటుంది. వేసవి కాలంలో ఈ జలశాలకు మరింత ఆదరణ ఉంటుంది. పాదచారులు,వాహన దారులతో పాటు స్థానిక వ్యాపారుల దాహార్తిని తీరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment