water distributions
-
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్‌లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మోహన్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
నీటి పంచాయతీపై చలో ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏడాది కిందట ఈ బోర్డులతో చర్చించిన పిదప మరెలాంటి చర్చలు చేయని కేంద్రం, తొలి సారి రెండు నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు, కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు సమాయత్త మైంది. ఈ నెల 13న ఢిల్లీలో బోర్డులతో భేటీ నిర్వ హిస్తామని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల వనరుల శాఖ లేఖలు రాసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో నెలకొన్న వివాదా లతో పాటు, పోలవరం పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపై అన్న నివేదికలతో రావాలని కేంద్రం బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్త ప్రాజెక్టులపై వివాదం కొనసాగు తోంది. తెలంగాణ ఇటీవలే వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి ఎత్తిపోతల పథకాలు చేప ట్టిందని ఏపీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటే బోర్డుల పరిధి, వర్కిం గ్ మ్యాన్యువల్‌ను ఆమోదిం చాల్సి ఉంది. దీనిపై తెలంగాణ అనేక అభ్యంతరాలు చెబుతోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటా యింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటు న్నామని చెబుతోంది. దీంతో బోర్డు మ్యాన్యు వల్కు ఆమోదం దక్కడం లేదు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటే ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చిద్దామని కేంద్రం బోర్డులకు స్పష్టం చేసింది. మళ్లింపు వాటా, ముంపు తీవ్రత ప్రధానం.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు (పట్టిసీమ) ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీ లు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ వాటాలకోసం ఇటీవల తెలంగాణ.. బోర్డుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన 13న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో రెండు బోర్డుల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. -
కాంట్రాక్టర్లకు కాసుల పండుగ.. రైతులకు తప్పని ఇక్కట్లు
సాక్షి, సరుబుజ్జిలి(శ్రీకాకుళం): మండల పరిధిలో సుమారు 4500 హెక్టార్ల సాగు భూమిని కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ కాలువ గట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. వంశధార కుడి ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ విషయమై వంశధార అధికారులకు పలు సమావేశాల్లో అందించిన వినతులు బుట్టదాఖలవుతున్నాయి. గత రెండేళ్లకాలంలో వంశధార కాలువలకు నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టిన పనుల వలన కాంట్రాక్టర్ల జేబులు నిండాయి తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు నిర్వహించారని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
వందేళ్లుగా దాహం తీరుస్తూ...
చార్మినార్: నగరంలో దాహం తీర్చడానికి పలు ప్రాంతాలలో చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆయా ప్రాంతాలలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వసుంటాయి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా దాహంతో ఉన్న ప్రజలకు మంచినీరు అందజేయడానికి చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో స్వచ్చందంగా మంచినీటిని అందజేస్తుండడం ప్రశంసనీయం. మంచినీటి సౌకర్యం కల్పించే ప్రక్రియ దాదాపు నిజాం కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే, పాతబస్తీలో రౌండ్ ది క్లాక్ మంచినీరు అందజేస్తున్న చలివేంద్రాలు కూడా ఉన్నాయి. ఏడాది పొడవునా మంచినీరు అందుబాటులో ఉంటుంది. పాతబస్తీలోని ముర్గీచౌక్ వద్ద ఉన్న చలి వేంద్రం 100 ఏళ్లుగా దాహం తీరుస్తోంది. 1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద... 1919లో ఖిల్వత్ చౌరస్తా సమీపంలోని ముర్గీచౌక్ వద్ద నిజాం కాలంలో నీటి కేంద్రం నిర్మాణం జరిగింది. అప్పట్లో జల్‌శాల అనే వారు. జల్‌శాల అంటే నీటి కేంద్రం..అని. అప్పటి నుంచి ఈ జల్‌శాల ద్వారా ఇక్కడి ప్రజలకు మంచినీరు అందుతోంది. కాగా 1965లో అప్పటి హైదరాబాద్ మేయర్ దీనిని హైదరాబాద్ జనతా జల్శాలగా నామకరణం చేసి ఆధునీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మంచినీటి కేంద్రం నిరంతరం పని చేస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ నీరు అందుబాటులో ఉంటుంది. వేసవి కాలంలో ఈ జలశాలకు మరింత ఆదరణ ఉంటుంది. పాదచారులు,వాహన దారులతో పాటు స్థానిక వ్యాపారుల దాహార్తిని తీరుస్తోంది. -
నీటి పంపకాలపై నేడు నిర్ణయం
-
నీటి పంపకాలపై నేడు నిర్ణయం
► ఈ ఖరీఫ్‌కు కృష్ణా జలాల పంపకాన్ని తేల్చనున్న త్రిసభ్య కమిటీ ► ఏపీ, తెలంగాణ అవసరాలపై చర్చించి తుది నిర్ణయం ► మూడు నెలల కోసం 41 టీఎంసీలు అవసరమన్న తెలంగాణ ► కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలన్న ఏపీ హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంపై శనివారం నిర్ణయం వెలువడనుంది. ఇరు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించి నీటి విడుదల, షెడ్యూల్‌లను ఖరారు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీటిని... కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంతోపాటు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తుంది. తెలంగాణ, ఏపీల తాగు, సాగునీటి అవసరాలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇప్పటివరకు జరిగిన వినియోగం తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఖరీఫ్ నీటి విడుదల, అవసరాలపైనే ప్రధానంగా చర్చించారు. నీటి అవసరాల కోసం విజ్ఞప్తులు భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందు పెట్టాయి. సాగర్ ఎడమ కాలువ కింద ఖరీఫ్‌కు 31 టీఎంసీలు, వచ్చే మూడు నెలల పాటు హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమని తెలంగాణ పేర్కొంది. మరోవైపు ఏపీ మాత్రం కేవలం సెప్టెంబర్ వరకే 47 టీఎంసీలు కావాలని కోరింది. సాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరు నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగు గంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ శనివారం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ... ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు కేటాయిస్తున్న నీటిలో ఏపీ కూడా వాటా భరించాలని కోరింది. అయితే నీటి వినియోగంపై వాటర్సెస్, ఇతర ట్యాక్సులు వసూలు చేస్తున్నందున ఏపీ నుంచి వాటా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్రం వాదించింది. ఇక 2014-15 ఏడాదిలో ఏపీ తన వాటాకు మించి 30 టీఎంసీలు అదనంగా వాడుకుందని, వాటిని సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరగా... నీరు సమృద్ధిగా ఉన్న సమయంలో సర్దుబాటు చేస్తామని ఏపీ పేర్కొంది. ఇక శ్రీశైలం విద్యుత్‌ను చెరి సగం చొప్పున పంచాలని తెలంగాణ కోరగా.. ఏపీ అంగీకరించలేదు. ఈ అంశాన్ని కేంద్ర విద్యుత్ శాఖ తేల్చుతుందని స్పష్టం చేసింది. చిన్న వనరుల నీటి వినియోగంపై కమిటీ చిన్న నీటి వనరుల్లో నీటి వినియోగంపై లెక్కలు సమర్పించాలని పదేపదే కోరుతున్నా ఇరు రాష్ట్రాలు స్పందించడం లేదని సమావేశంలో బోర్డు ప్రస్తావించింది. దీనిపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు చేయడంతో.. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్న వనరుల నీటి వినియోగాన్ని పరిశీలించి.. సెప్టెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్‌కు పాలమూరు, డిండి బోర్డు సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల అంశాన్ని ఏపీ ప్రస్తావించింది. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావని ఇప్పటికే చెప్పామని.. అంతేగాకుండా ఈ వ్యవహారాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయించినందున అక్కడే దీనిపై చర్చిద్దామని తెలంగాణ సూచించింది. అందుకు ఏపీ అంగీకరించింది. ఇక పట్టిసీమ అంశాన్ని లేవనెత్తిన తెలంగాణ... బచావత్ అవార్డు మేరకు పోలవరం కాకుండా మరే ప్రాజెక్టు ద్వారానైనా గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తే, అంతే పరిమాణంలో నీటిపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరింది. కానీ దీనిపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ వాదించింది. ఈ అంశంపై మరోమారు చర్చిద్దామని బోర్డు సూచించడంతో.. చర్చ ముగిసింది. ఇక ప్రాజెక్టుల పరిధిలో బోర్డు సూచించిన చోట టెలీమెట్రీ విధానం అమల్లోకి తెచ్చేందుకు అంగీకారం కుదిరింది.