బిందెలు పట్టుకొని గోడ ఎక్కుతూ మహిళల అవస్థలు
చింతలమానెపల్లి(సిర్పూర్): పల్లె ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. అందులోనూ మహిళల అవస్థలు వర్ణానాతీతం. ఆ గ్రామంలో తాగునీటి ఇక్కట్లకు ఈ చిత్రాలే నిదర్శనం. చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నీరు కలుషితంగా మారగా.. తాగేందుకు వినియోగించలేని పరిస్థితి. దీనికి తోడు గ్రామంలో చేతి పంపుల చుట్టూ మురుగు నీరు నిలిచి ఉండడంతో వాటినీ ఉపయోగించడం లేదు. దీంతో కొత్తవాడ, కమ్మరివాడ, సాత్పుతె వాడ ప్రజలు స్థానిక ఉన్నత పాఠశాలలోని చేతిపంపునీటిని తాగునీటిగా వినియోగిస్తున్నారు. కాగా పాఠశాలకు వేసవి సెలవుల కారణంగా గేటుకు తాళం వేయడంతో మహిళలు ఇలా గోడ దూకి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment