సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శించామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారీని కట్టడి చేస్తామని పేర్కొన్నారు.
(సూర్యాపేటలో సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు)
కంటైన్‌మెంట్ ఏరియాలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడదని, కంటైన్‌మెంట్ ఏరియాలోకి బయటివారు రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్‌లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామన్నారు. అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.(సూర్యాపేటలో కరోనా కలకలం)
అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసం మా బృందానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు లాక్ డౌన్ అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. కమిషన్ ఏజంట్‌కు కరోనా పాజిటివ్ రావడం.. అతను ఎన్నో దుకాణాదారులను కాంటాక్ట్ కావడం వల్లే జిల్లాలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందన్నారు. (సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓపై వేటు)
Comments
Please login to add a commentAdd a comment