తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు ఆర్టీసీ చార్జీల పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. రవాణాశాఖలో ఉద్యోగాల భర్తీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న అనంతరం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రవాణాశాఖలో ద్వారా నాలుగు నెలల్లో రూ.800 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నామన్నారు. వచ్చే మార్చి నాటికి రూ. 2,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.