మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లాలో కరువు ఛాయలు రైతన్నను వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌లో సాగుచేసిన ఆరుతడి పంటలు ఎండిపోగా.. కొద్దిపాటి నీటివసతి ఉన్న వారికి కూడా వరి నాటేందుకు అవకాశం లేకుండాపోయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. నీటిమట్టం ఇప్పటికే మూడు అడుగుల మేర లోతుల్లోకి పడిపోయింది. వరినారు ముదిరిపోవడం తో అన్నదాతలు దిక్కుతోచనిస్థితిలోపడ్డారు. ఏటా వాతావరణంలో మార్పుల కారణంగా ఖరీఫ్‌లో సాగువిస్తీర్ణం తగ్గిపోతుంది. ఐదేళ్లతో పోల్చితే భూగర్భజ ల మట్టం కనిష్టస్థాయికి పడిపోవడం ఇ ది రెండోసారి.
జిల్లా భూగర్భజలం సా ధారణ స్థాయి 11.52 మీటర్లు కాగా, 2013 జూన్‌లో 16.40మీటర్ల లోతుల్లో కి పడిపోయింది. మళ్లీ ఈ ఏడాది జూ న్‌లో సాధారణ స్థాయి కన్నా 2.09 మీ టర్ల లోతు.. అనగా 13.61మీటర్లకు ప డిపోయింది. అంతేకాకుండా ఆగస్టులో కూడా వర్షభావం వెంటాడటంతో రెం డుమీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడి పోయే అవకాశం ఉందని సంబంధి త అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 15మీటర్లలోతుల్లోకి నీరు పడిపోయిందని భావిస్తున్నారు. వచ్చే ఆగ స్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు కురవకపోతే మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
77గ్రామాల్లో కొత్తబోర్ల నిషేధం
భూగర్భజలాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో జిల్లాలోని 77 గ్రా మాల్లో కొత్తగా బోర్లు వేసేందుకు భూగర్భజలశాఖ అధికారులు నిషేధం వి ధించారు. జిల్లాలోని ఆమనగల్లు మం డలంలో 5 గ్రామాలు, బొంరాస్‌పేట మండలంలో 7గ్రామాలు, జడ్చర్ల మం డలంలో 8గ్రామాలు, కల్వకుర్తి మండలంలో 7గ్రామాలు, కేశంపేట మండలంలో 5గ్రామాలు, మిడ్జిల్ మండలం లో 14గ్రామాలు, తలకొండపల్లి మండలంలో 7 గ్రామాలు, ఉప్పునుంతల మండలంలో 5గ్రామాలు, తాడురు మండలంలో 5 గ్రామాలు, షాద్‌నగర్ మండల పరిధిలో 4 గ్రామాలు, అ చ్చంపేట, కొందుర్గు, కోయిల్‌కొండ, మాడ్గుల మండలాల పరిధిలో ఒక్కో గ్రామం ఉండగా, కొత్తూరు మండలం లో మరో రెండుగ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో తాగునీటి వసతికి తప్ప వ్యవసాయం, ఇతర అవసరాలకు కొత్తబోర్లు వేయకూడదని సూచించారు. ఆ యా గ్రామాల్లో 70 నుంచి 90శాతం వ రకు భూగర్భజలం పడిపోవడంతో అ ధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ విచ్చలవిడిగా బోర్లు వేస్తూ వల్టాచట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
ఆందోళనలో అన్నదాతలు
భూగర్భజలాలు అట్టడుగుస్థాయికి పడిపోవడంతో రైతులు ఆందోళనలో ప డ్డారు. జిల్లాలో 1.70లక్షల బోర్లు ఉం డగా వీటికింద 1.23లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. కాగా, ఈ ఏటా దాదాపు సగానికిపైనే బోర్లలో నీరు తగ్గుముఖం పట్టినట్లు అధికారు లు అంచనా వేస్తున్నారు. మరికొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ప్రభావం వరిసాగుపై పడింది. ఖరీఫ్‌లో బోరుబావులు, కాల్వల కింద సాధారణ సాగు 1.10లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 20వేల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేశారు. అంతేకాకుండా ఎప్పటిలాగే వరిని సాగుచేద్దామని భావించి.. నారు పెంచుకున్న రైతుల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. బోర్లలో నీరుతగ్గిపోవడంతో వరినాట్లు వేసేందుకు వెనక్కితగ్గుతున్నారు. ఇటు వర్షాధార పంటలు సాగుచేయలేక.. ఇటు నీటి ఆధారిత పంటలు పండించలేక రైతులు చతికిలపడిపోయారు. వచ్చే రెండు నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగితే కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడాల్సిందే.
విచ్చలవిడిగా బోర్లు వేయొద్దు
రైతులు విచ్చలవిడిగా బోర్లు వేయకూడదు. అలాగే ఉన్న నీటిని విచ్చలవిడిగా వాడి వృథాచేయకుండా అవసరం మేరకు వాడుకోవాలి. నీటిని భూమిలో ఇంకే విధంగా రైతులు కృషిచేయాలి. వర్షపు నీటిని బావులు, ఇంకుడు గుంతలకు మళ్లించి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిషేధించిన గ్రామాల్లో బోర్లు వేయడం మానుకోవాలి.
- రమాదేవి, డిప్యూటీ డెరైక్టర్ భూగర్భజలవనరుల శాఖ
నీళ్లేవి..?
Published Thu, Jul 30 2015 1:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement