వర్షాభావంతో ఇప్పటికే పంట నష్టపోయిన రైతులను పంటల బీమా పథకం కూడా ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. బీమాపై కంపెనీలు రోజుకో రకమైన మార్గదర్శకాలు విడుదల చేస్తుండడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. బీమా ప్రీమియం చెల్లింపు విషయంలో రైతులకు మార్గనిర్దేశనం చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7.38 లక్షల హెక్టార్లు కాగా 6.71లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో 90.89 శాతం సాగుకు నోచుకున్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆగస్టు చివరి వారాన్ని మినహాయిస్తే 2014 ఖరీఫ్‌పై వర్షాభావం తీవ్ర ప్రభావం చూపింది. పంట నష్టం నుంచి రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్‌ఎఐఎస్) కింద బీమా ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది.
తొలుత వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, కంది, పెసలు, ఆముదం, పొద్దుతిరుగుడు, చెరుకు, మిరప పంటలకు బీమా చెల్లించేందుకు జూలై 31వ తేదీని గడువుగా విధించా రు. అయితే బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ప్రీమి యం చెల్లింపు వెసులుబాటు కల్పించా రు. మొక్కజొన్న పంటను గ్రామం యూనిట్‌గా, ఇతర పంటలకు మండ లం యూనిట్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. బీమా పథకం అమలు బాధ్యతను అగ్రికల్చరల్ ఇన్సూరెన్సు కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించారు. పత్తి సాగు చేసిన రైతు లు మాత్రం పంటల బీమాను వాతావరణ ఆధారిత బీమా పథకం కింద చేర్చారు. అయితే బీమా పథకంపై రైతులకు అవగాహన కలగకముందే ప్రీమియం చెల్లింపు గడువు ముగి సింది. ఓ వైపు వర్షాభావం, మరోవైపు ప్రీమియం చెల్లించే అవకాశం లేక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గడువు పెంచినా లాభం లేదు
ఆగస్టు 12న రాష్ట్రస్థాయి పంటల బీమా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పెంచాలని ప్రతిపాదించా రు. వాతావరణ ఆధారిత బీమా పథ కం కింద ఉన్న పత్తి పంటను జాతీయ వ్యవసాయ బీమా పథకం పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 22వ తేదీన వ్యవసాయ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
దీం తో బీమా చెల్లింపునకు వారం రోజులు గడువు మాత్రమే ఉండడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి బీమా ప్రీమి యం డిమాండు డ్రాఫ్టులు తీశారు. ఈనెల 6 లోగా బీమా కంపెనీ చిరునామాకు డీడీలు పంపేందుకు రైతులు, వ్యవసాయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బీమా కంపెనీ తాజాగా చేసిన ఓ ప్రకటనతో అటు రైతులు, ఇటు వ్యవసాయ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం నెల వయసున్న పంటలకు మాత్రమే ప్రీమియం చెల్లించాలని బీమా కంపెనీ గడువు ముగిసిన తర్వాత తేల్చి చెప్తోంది.
ఆందోళనలో రైతాంగం
గడువు ముగిసిన తర్వాత బీమా కంపెనీ ఈ రకమైన ప్రకటనలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ముగిసే వరకు ప్రీమి యం చెల్లించుకున్న బీమా సంస్థ ఇప్పు డు మాట మార్చడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరిహారంపై ఆశతో ప్రీమి యం చెల్లించిన రైతులకు మొండిచేయి ఎదురయ్యేలా ఉంది.
‘బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే సరైన స్పం దన కనిపించడం లేదు. రైతులే నేరుగా బీమా కంపెనీకీ ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రైతులకు సహకరించే ఉద్దేశంతో కొన్నిచోట్ల ప్రీమియం డీడీలను వ్యవసాయ అధికారులు తీసుకున్నారు. బీ మా కంపెనీ వైఖరితో అటు రైతులు, ఇటు బీమా సంస్థ నడుమ నలిగిపోయే పరిస్థితి నెలకొందని’ వ్యవసాయ శాఖ జేడీ భగవత్ స్వరూప్ ‘సాక్షి’తో వ్యా ఖ్యానించారు. జిల్లా నుంచి ఎందరు రైతులు ఎంత మొత్తాన్ని ప్రీమియం చెల్లించారనే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
తిరకాసు..!
Published Thu, Sep 4 2014 3:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement