బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ వద్ద ఉన్న ఎలుగుబంటి
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఓ ఎలుగుబంటి ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిన్న రాత్రి బొమ్మకల్‌కు వచ్చిన ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమికొట్టడంతో అది కరీంనగర్‌కు చేరుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద పాగా వేసింది. ఉదయం పేపర్ వేయటానికి అటుగా వచ్చిన పేపర్‌బాయ్స్ దాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. నిత్యం రద్దీగా ఉండే టవల్ సర్కిల్ ప్రాంతంలోకి ఎలుగుబంటి రావటంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి షాపులను బంద్ చేయించారు.
దాదాపు ఏడు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ఫలించింది. దొరకకుండా ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి అధికారుల చేతికి చిక్కింది. డీఎఫ్‌ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బంధించిన ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామన్నారు. వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేయటంతో జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణులను రక్షించేందుకే పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment