చెక్‌పవర్‌పై వెనక్కి తగ్గేది లేదు: కేటీఆర్ | will never back on check power, says KTR | Sakshi
Sakshi News home page

చెక్‌పవర్‌పై వెనక్కి తగ్గేది లేదు: కేటీఆర్

Published Sun, Jan 18 2015 4:20 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

చెక్‌పవర్‌పై వెనక్కి తగ్గేది లేదు: కేటీఆర్ - Sakshi

చెక్‌పవర్‌పై వెనక్కి తగ్గేది లేదు: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: పంచాయితీ కార్యదర్శులకు కల్పించిన అధికారాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. తెలంగాణ  పంచాయతీ కార్యదర్శుల సంఘం డైరీ, కరదీపికలను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని, కార్యదర్శులకు సర్పంచ్‌లతో పాటు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిని అధికారంగా భావించకుండా బాధ్యతగా ఉపయోగించాల ని సూచించారు. సర్పంచులతో సమన్వయంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని  పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ప్రతినిధులు యాదగిరి, ఉపేందర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, మల్లికార్జున్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement