మద్యం మత్తులో బావిలో దూకిన మహిళ | Woman commits Suicide | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో బావిలో దూకిన మహిళ

Published Tue, Jun 2 2015 7:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Woman commits Suicide

మహబూబ్ నగర్ (లింగాల) : మద్యం మత్తులో ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పద్మన్నపల్లికి చెందిన నేనావత్ లక్ష్మి(50) రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో గొడవ పడి తాగిన మైకంలో వెళ్లి గ్రామం మధ్యలో ఉన్న బావిలో దూకి చనిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలికి భర్త, నలుగురు కుమారులు ఉన్నారు. అయితే ఈ బలవన్మరణ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement