లారీ ఢీకొని వృద్ధురాలు మృతి | Woman dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

Published Thu, Dec 3 2015 7:58 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Woman dies in road accident

నేరేడుచర్ల (నల్లగొండ) : రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వృద్ధురాలు సిమెంటు లారీ ఢీకొట్టటంతో మృత్యువాత పడింది. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నేరేడుచర్లకు చెందిన పోతురాజు రాములమ్మ(70) స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement