పాముకాటుకు గురై ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఆవునూర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ముస్తాబాద్ (కరీంనగర్) : పాముకాటుకు గురై ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఆవునూర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల రేణుక(45) ఆదివారం ఉదయం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందింది.