పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
ఖమ్మం: పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం దిబ్బగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న చాతా ఆదిలక్ష్మి వివాహం ఈ నెల 21న అదే జిల్లాకు చెందిన బూర్గంపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. భర్తతో కలసి ఆదిలక్ష్మి దిబ్బగూడెంలోని తన తండ్రిగారింటికి వచ్చింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కారణాలు తెలియాల్సి ఉంది.