ఆందోళన చేస్తున్న ఆలేటి రజిత
సైదాపూర్(కరీంనగర్) : సైదాపూర్ మండలం వెన్కెపల్లికి చెందిన ఆలేటి రజితకు పంచాయతీ కార్యదర్శి ఇంటి ఫర్మిషన్ ఇవ్వడం లేదని గ్రామపంచాయతీలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంగళవారం ఆందోళనకు దిగింది.వెన్కెపల్లిలో ఆలేటి రాములు–రజిత దంపతులు టైలరింగ్ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి గ్రామపంచాయతీ పర్మిషన్ కావాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పర్మీషన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీలో కిరోసిన్ పోసుకొని తలుపులు వేసుకుంది. స్థానిక పోలీసులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు వచ్చి సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తలుపులు తీసి అక్కడ నుంచి రజిత ఇంటికి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment