నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం పచ్చలనడకుడ గ్రామానికి చెందిన వివాహిత స్వైన్‌ఫ్లూతో మృతి చెందింది.
వెల్పూర్: నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం పచ్చలనడకుడ గ్రామానికి చెందిన వివాహిత స్వైన్‌ఫ్లూతో మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకన్నగారి రాజేశ్వర్, రాజవ్వ(46) దంపతులది వ్యవసాయ కుటుంబం. కాగా, రాజవ్వ తీవ్ర జ్వరం రావటంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి రాజవ్వ గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో మృతి చెందింది.