హైదరాబాద్:నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. శుక్రవారం ప్రాణంతాక స్వైన్ ఫ్లూ వైరస్ తో మరో మహిళ మృతి చెందిన ఘటన ఉస్మానియా ఆస్పత్రిలో వెలుగుచూసింది.కొన్ని రోజుల క్రిత స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆ మహిళ మృత్యువుతూ పోరాడి ఈరో్జు ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారిన పడి ఆరుగురు మృతి చెందారు.
ఇదిలా ఉండగా గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌కు చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్దారించలేదు.
హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
Published Fri, Jan 2 2015 8:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement