కేసీఆర్‌ను మహిళా లోకం క్షమించదు
నయీంనగర్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మహిళాలోకం క్షమించదని కాకతీ య యూనివర్సీటి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి కిష న్ అన్నారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని జేఏసీ పట్టణ కార్యాలయంలో వేణుచారి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ ఎంతో మంది మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్‌ను నమ్ముకుని పని చేస్తున్నారని, ఇప్పటి వరకు ఏఒక్క వేదికపైనా మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేద ని విమర్శించారు. బతుకమ్మ సెంటిమెంటు ను ఆసరగా చేసుకుని జాగృతి అధ్యక్షురాలు కవితను ఎంపీగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు.
తన కుటుంబంపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లితోపాటు ఉద్యమంలో పాల్గొన్న రహీమున్నీసాబేగం లాంటి మహిళలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించా రు. శ్రీనివాస్, గోవార్ధన్, రాజు పాల్గొన్నారు.