కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్ల ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఆమె మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లకు గాను 61 గేట్ల నిర్మాణం, బిగింపు పనులు పూర్తి చేశామని, మిగతావి జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రకు ఆవలి వైపున బ్యారేజీ పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసి పనులు మే 15 వరకు ఎట్టి పరిస్ధితుల్లో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందించాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు.
అక్కడి నుంచి ఆమె కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్‌కు చేరుకున్నారు. పంపుహౌస్‌లో 11 మోటార్లకు 7 మోటార్ల బిగింపు పూర్తయిందని, మిగతావి మేలో పూర్తి చేయనున్నట్లు మెగా కంపెనీ డైరెక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. గ్రావిటీ కాల్వలో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆమె ఆదే శించారు. ఆమె వెంట కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈలు సూర్యప్రకాశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment