medigadda byareji
-
కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ ఓ వైఫల్యమే అని.. దీని ద్వారా జరిగే లబ్ధికన్నా నష్టమే ఎక్కువని ‘కడెం ప్రాజెక్టు– కాళేశ్వరం సోకులు– నిజానిజాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీ ద్వారా ఎత్తిన నీటికంటే, మేడిగడ్డ నుంచి సముద్రానికి వెళ్లిందే ఎక్కువని తేలి్చచెప్పింది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే నిర్మాణ వ్యయం వృథా అయ్యేది కాదని, ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచి్చంచి పైసా ప్రయోజనం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేసింది. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని తీర్మానించింది. గురువారం తెలంగాణ జల సాధన నమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి, బీజేపీ నేత విజయరామారావు, కాగజ్‌నగర్ నేత పాల్వాయి హరీశ్, టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్, కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎల్లంపల్లికి వచి్చన నీళ్లు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఏవీకూడా కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా ఎత్తిపోసినవి కావన్నారు. సుమారు 1,500 టీఎంసీలు మేడిగడ్డను దాటుకుంటూ సముద్రంలోకి వెళ్లాయ ని తెలిపారు. ప్రతిఏటా విద్యుత్, వడ్డీలు, నిర్వహణకు అయ్యే వ్యయం రూ.65 వేల కోట్లు ఉంటుందన్నారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిందని, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.3 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. జాతీయ హోదాపై మభ్య పెట్టారు.. మేడిగడ్డ వద్ద లభ్యతగా ఉండే జలాల్లో 80 శాతం ప్రాణహిత నది నుంచి వచ్చేవేనని, అక్కడ తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు పారించే అవకాశం ఉండేదని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని సీఎం కేసీఆర్ కేవలం నోటిమాట ద్వారానే కోరారు తప్పితే దానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు కేంద్రానికి సమరి్పంచలేదని కేంద్ర జలశక్తి మంత్రి స్వయంగా రాజ్యసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలని కోరారు. -
మే 15 నాటికి ‘మేడిగడ్డ’ పూర్తి చేయాలి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్ల ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఆమె మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లకు గాను 61 గేట్ల నిర్మాణం, బిగింపు పనులు పూర్తి చేశామని, మిగతావి జరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రకు ఆవలి వైపున బ్యారేజీ పనులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసి పనులు మే 15 వరకు ఎట్టి పరిస్ధితుల్లో పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందించాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు. అక్కడి నుంచి ఆమె కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్‌కు చేరుకున్నారు. పంపుహౌస్‌లో 11 మోటార్లకు 7 మోటార్ల బిగింపు పూర్తయిందని, మిగతావి మేలో పూర్తి చేయనున్నట్లు మెగా కంపెనీ డైరెక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. గ్రావిటీ కాల్వలో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, ఇంజనీర్లను ఆమె ఆదే శించారు. ఆమె వెంట కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, డీఈఈలు సూర్యప్రకాశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం
మహదేవపూర్ (మంథని): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందం గురువారం సాయంత్రం సందర్శించింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ ‘కాళేశ్వరం మహా అద్భుతమని’కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడి పనులను చూసి నేర్చుకోవాలని ఎక్స్పోజర్ విజిట్ (తెలియని దానిని తెలుసుకునే సందర్శన)కు సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందాన్ని పంపారు. మేడిగడ్డ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనులను సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్కే.రాజన్ నేతృత్వంలో 12మంది ఇంజనీర్ల బృందం పరిశీలించింది. క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనం, కాళేశ్వరం ఇం జనీరింగ్ నుంచి కొత్త అంశాలను నేర్చుకోవడానికి వచ్చినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పేర్కొన్నారు. ఒకే రోజు 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగిన ప్రాజెక్టుగా రికార్డు నెలకొల్పిన ప్రాజెక్ట్ సందర్శన భవిష్యత్‌లో తమకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారిగా భారీ మోటార్లను ఉపయోగిస్తూ పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ ఈ ప్రాజెక్టు రికార్డు సృష్టించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో 8 దేశాలు పాలుపంచుకుంటున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని, ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ ఇంజనీర్ల బృందానికి డైరెక్టర్ ఎస్కే రాజన్ నాయకత్వం వహించగా మరో డైరెక్టర్ దేవేందర్‌రావు, ఇంజనీర్లు కృష్ణారావు, సంవృత అగర్వాల్, అశ్వీనికుమార్వర్మ, వైశాఖ, ధీరజ్‌కుమార్, శకిట్కుమార్, ఈశాన్ శ్రీవాత్సవ, చేతన, డీఎస్ ప్రసాద్, అమిత్కుమార్సుమన్ తదితరులు బ్యారేజీని సందర్శించారు. ఎల్అండ్టీ ప్రాజెక్టు మేనేజర్ రామరాజు, ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి, డీఈ సూర్యప్రకాష్ బ్యారేజీ వివరాలను వారికి వివరించారు. -
వంద రోజులు.. కోటి ఆశలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనున్న ప్రతిష్టాత్మక పథకం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు మళ్లించేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నుంచి సరిగ్గా వంద రోజుల్లో.. అంటే జూలై మూడో వారంలో మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌజ్‌ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే బ్యారేజీల పరిధిలో గేట్ల బిగింపు ప్రక్రియ మొదలవగా.. మోటార్లు, పంపులు, డెలివరీ మెయిన్ వంటి వ్యవస్థల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. విదేశాల నుంచి భారీ మోటార్లను ఈ నెలాఖరు నాటికి తెప్పించి బిగింపు ప్రక్రియ మొదలు పెట్టేలా నీటి పారుదల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వేగంగా గేట్ల బిగింపు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే మరింత ముందుగానే ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూలై రెండో వారం నుంచే రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసి.. ఖరీఫ్ ఆయకట్టుకు అందించేలా ప్రాజెక్టు పనులను వేగిరం చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే బ్యారేజీలు, పంపుహౌజ్ పనుల్లో 80 శాతం కాంక్రీటు పనులు పూర్తవగా.. మిగతా 20 శాతం పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1.63 కిలోమీటర్లుకాగా 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముందుగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా జూన్ నాటికి కనీసం 10 గేట్లు ఏర్పాటు చేసేలా పనులు జరుగుతున్నాయి. మరో వారంలో ఇక్కడ గేట్లు అమర్చే ప్రక్రియ మొదలవనుంది. ఇక అన్నారం బ్యారేజీలో 66 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 6 గేట్ల ఏర్పాటు పూర్తయింది. నెలాఖరుకు మొత్తంగా 20 గేట్లు బిగించి.. జూన్ నాటికి మిగతా పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీల పనులు అన్నారం బ్యారేజీ పనులను రూ.1,464 కోట్లతో చేపట్టగా రూ.వెయ్యి కోట్ల మేర పనులు పూర్తికావడం గమనార్హం. మిగతా బ్యారేజీలతో పోలిస్తే çసుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా.. అన్నారం బ్యారేజీ తర్వాత దాని పనులే అధిక వేగంతో ముందుకెళ్తున్నాయి. ఈ బ్యారేజీ పొడవు 1.45 కిలోమీటర్లు, నిల్వ సామర్థ్యం 8.5 టీఎంసీలు కాగా... దీనికోసం 81 పిల్లర్లు నిర్మించి 74 రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 4 గేట్లు బిగించగా.. నెలాఖరుకు 15 గేట్లు, వచ్చే నెలలో 25 గేట్ల ఏర్పాటు పూర్తిచేసి జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. ఈ బ్యారేజీలో మొత్తంగా రూ.1,444 కోట్ల పనుల్లో రూ.800 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మోటార్ల బిగింపునకు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే మూడు పంపుహౌజ్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా.. పంపులు, మోటర్ల బిగింపు పనులు నెలాఖరు నుంచి మొదలు కానున్నాయి. మోటార్లు అమర్చేందుకు వీలుగా ఇతర పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నారు. మూడు పంపుహౌజ్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా దేశాల కంపెనీల ప్రతినిధులతో నీటి పారుదల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. మోటర్లు ఈనెల చివరికి రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. మేడిగడ్డ పంపుహౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. జూన్ చివరి నాటికి 5 మోటార్లను బిగించనున్నారు. ఈ పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. దీనికి దిగువన అన్నారం పంపుహౌజ్‌లో 8 మోటార్లకుగాను జూన్ చివరికి నాలుగు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా జూన్ చివరికి మోటార్లను సిద్ధం చేసి డ్రై, వెట్ ట్రయల్ రన్లను నిర్వహించాలని... జూలై రెండో వారంలో గోదావరి ఉధృతి పెరిగే సమయానికి నీటిని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి దిగువన శరవేగంగా.. ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌజుల్లోనూ ఒక్కో టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌజ్‌లు నిర్మించాల్సి ఉండగా.. 88 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు పంపులను ఇప్పటికే సిద్ధం చేశారు. మరో రెండు పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తో పాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చుతున్నారు. ఇందులో 2 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. జూలై రెండో వారం నుంచి నీళ్లు.. మిడ్‌మానేరుకు చేరే నీటిని అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా.. గంధమల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా నిర్మిస్తున్న గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాల్స్, టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ మొదటి వారానికే మెజారిటీ పనులను పూర్తి చేసి.. టెస్ట్ రన్లు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జూన్ చివరి నాటికి లోపాలను సరిదిద్దుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 16 నాటికి సాగునీటిని తరలించాలని దిశానిర్దేశం చేశారు. వంద రోజుల కౌంట్‌డౌన్ పెట్టిన నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అటు లైవ్ కెమెరాల ద్వారా, ఇటు అధికారుల ద్వారా సమీక్షిస్తున్నారు. కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ చైర్మన్ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆదివారం హైదరాబాద్ రానున్న ఆయన.. సోమవారం ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులను పరిశీలించే అవకాశముందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు సీడబ్ల్యూసీ సీఈ నవీన్‌కుమార్ సైతం ఈ పర్యటనలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం నుంచి కీలకమైన కాస్ట్ అప్రైజల్, ఇరిగేషన్ ప్లానింగ్ వంటి రెండు, మూడు అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలో మసూద్ హుస్సేన్ పర్యటన కీలకం కానుంది. -
‘మేడిగడ్డ’కు మావోల ముప్పు!
⇒ మహారాష్ట్ర పరిధిలోని బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో ప్రాబల్యం ⇒ నిర్వాసితులతో కలసి ఐక్య పోరాటానికి కార్యాచరణ ⇒ ప్రాజెక్టు రక్షణ చర్యల కోసం గడ్చిరోలి కలెక్టర్‌కు రాష్ట్ర అధికారుల లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మావోయిస్టుల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా బ్యారేజీ పనులు జరుగుతున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పరిధిలో ఇటీవల మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతుండటం, నిర్వాసితులతో కలసి పోరాడేందుకు ఐక్య కార్యాచరణ రూపొందిస్తుండటం నీటిపారుదల శాఖలో కలవరం సృష్టించింది. వణికిస్తున్న గడ్చిరోలి పరిణామాలు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద 101 మీటర్ల ఎత్తులో 19.73 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తుండటం తెలిసిందే. దీనివల్ల మొత్తం 13,075 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుండగా ఇందులో 10,218 హెక్టార్లు రివర్బెడ్లోనే ఉండనుంది. తెలంగాణ పరీవాహకంలో 1,629 హెక్టార్లు, మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల పరిధిలో 1,227 హెక్టార్ల ముంపు ప్రాంతం ఉంటోంది. గతేడాది ఆగస్టు 26 నుంచే బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రేడియల్ గేట్లు, గైడ్ బండ్స్ వంటి నిర్మాణాలను మేడిగడ్డ, మహారాష్ట్రలోని సిరోంఛ తాలూకా పోచంపల్లి గ్రామం మధ్య చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే బ్యారేజీకి ఎడమ పక్కగా పనులు చేస్తున్న ఎల్ అండ్ టీ సిబ్బంది 1.69 హెక్టార్లలో క్యాంపులు వేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాంత పరిధిలోని గడ్చిరోలి జిల్లా సిరోంఛ, ఆసరెల్లిలో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగాయి. బ్యారేజీ కింది నిర్వాసిత గ్రామాలైన వడిజెం, పోచంపల్లి, మద్దికుంట, చింతపల్లిలో మావోయిస్టులు...బ్యారేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాం దోళనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ద తిస్తున్నారు. ఇటీవల గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ ప్రభుత్వ కలప డిపోతోపాటు కొన్నిచోట్ల రోడ్ల పనులు చేస్తున్న భారీ వాహనాలను తగులబెట్టారు. నిర్వాసిత గ్రామాల్లోనూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ పోస్టర్లు అంటించారు. దీనికి తోడు గోదావరి పరీవాహకం వెంబడి రాష్ట్రాల్లో మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రత కోసం గడ్చిరోలి కలెక్టర్‌కు వినతులు.. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో నిర్వాసితుల ఆందోళనల దృష్ట్యా మావోయిస్టులు ఏ రూపంలో అయినా విరుచుకుపడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్... గడ్చిరోలి కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. బ్యారేజీ పనులకు మావోయిస్టులు అంతరాయం కలిగించే ప్రమాదం ఉన్నందువల్ల భద్రత కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు గడ్చిరోలి ప్రభావం ఈ ప్రాజెక్టు పరిధిలోని రాష్ట్ర భూభాగంలోనూ ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ప్రభుత్వం సీఆర్పీఎఫ్ బలగాలతో క్యాంపుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. వారంలో ఇక్కడ క్యాంపుల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలంగాణకు మంజూరైన ఒక ఇండియన్ రిజర్వ్ (ఐఆర్) బెటాలియన్‌తోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశించింది. -
బ్యారేజీల భారం రాష్ట్రానిదే
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణ బాధ్యత తెలంగాణదే - అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ భారాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే భరించాలని తెలంగాణ, మహారాష్ట్ర సీఎం్ల నేతృత్వంలోని అంతర్రాష్ట్ర వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మాత్రం 80:20 నిష్పత్తిన భరించనున్నారు. ప్రాజెక్టుల కింద సాధ్యమైనంత వరకు ముంపును నివారించేందుకు తెలంగాణ సర్కారు ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం చేపట్టాలని.. బ్యారేజీల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రైవేటు భూములేవీ ముంపు కాకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. భూసేకరణ చట్టం లేదా భూ కొనుగోలు విధానం ద్వారా సేకరించే ముంపు భూములకు తెలంగాణే పరి హారం చెల్లించాలని నిర్ణయించారు. వాటర్‌బోర్డు సమావేశం నిర్ణయాల మినిట్స్ కాపీని నీటి పారుదల శాఖ మంగళవారం విడుదల చేసింది. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకారం కుదరగా.. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో, ఛనాఖా-కొరాటాను 213 మీటర్ల ఎత్తుతో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రకారం... ఈ బ్యారేజీల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునే హక్కు మహారాష్ట్రకు ఉంటుంది. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు మహారాష్ట్రలోని బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. భూసేకరణ లేదా కొనుగోలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల నిర్వహణకు మహారాష్ట్ర సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పంచుకోవాల్సి ఉంటుంది. -
మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి
♦ 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్ల ముంపు నిర్ధారణ ♦ మహారాష్ట్ర అధికారులతో సీఎంఓ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ముంపుపై తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల అధికారుల ఉమ్మడి సర్వే కొలిక్కి వచ్చింది. మొత్తంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 101 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రాంతంలో 240 హెక్టార్ల ముంపు ఉంటుందని ఈ సర్వేలో తేలింది. అధికారికంగా నిర్ణయించిన ముంపు ప్రాంతం చాలా తక్కువగా ఉన్నందున 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం మహారాష్ట్రని కోరనుంది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తమ్మిడిహెట్టి ఎత్తుపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య అవగాహ న కుదిరింది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకారం తెలి పింది. అయితే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డపై మాత్రం తేలలేదు. కిందటిసారి అధికారుల స్థాయిలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు అంగీకరిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా సర్వే చేసిన అధికారులు 102 మీటర్ల నుంచి వివిధ ఎత్తులో ఉండే ముంపును తే ల్చారు. 102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టా ర్లు, 101.5 మీటర్ల ఎత్తులో 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 101.5మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఒకవేళ 101.5 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్థ్యం 21.75 టీఎంసీలు ఉండనుండగా, 101 మీటర్లకు పరిమితమైతే అది 19.73 టీఎంసీలుగా ఉండనుంది. త్వరలో ఒప్పందాలు మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలపై ఈ నెలాఖరులోగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. అధికారుల స్థాయిలో కసరత్తు ముగిసిన దృష్ట్యా, ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పా టైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర సీఎం సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఒప్పందమే కుదిరింది!
మహారాష్ట్ర ఇరిగేషన్ ఎస్ఈఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలతో అధికారుల సమావేశం కాళేశ్వరం : మేడిగడ్డ బ్యారేజీవిషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు పోవద్దని ఒప్పందం మాత్రమే కుదిరిందని.. ఎత్తు నిర్ణయం ఆమోదం కాలేదని మహారాష్ట్ర నీటి పారుదల శాఖ ఎస్ఈ కుల్దీప్ రాంటెంకీ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు ఈనెల 8న ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాలో శనివారం ఎస్ఈ కుల్దీప్ రాంటెంకీ, తహశీల్దార్ అశోక్ గోదావరి పరివాహక పెంటిపాక, తూమునూరు, అయిపేట గ్రామస్తులతో సమావేశమయ్యూరు. అనంతరం ఎస్ఈ విలేకరులతో మాట్లాడారు. ముంపు లేకుండా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 103, 102, 101 మీటర్ల ఎత్తులో సూత్రప్రాయంగా ఆలోచనకు వచ్చినప్పటికీ ఇంకా ఖరారు కాలేదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి ముంపు లేదని ఆలోచనకు వచ్చిన తర్వాతే బ్యారేజీ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం బ్యారేజీ డీఈఈ భద్రయ్య పాల్గొన్నారు.